Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాటిన మొక్కలను సంరక్షించాలి
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసమిబసు
- పల్లె ప్రకృతి వనం నిర్వహణ పట్ల సర్పంచ్ పద్మశ్రీనివాస్ను అభినందించిన కలెక్టర్
- బాసుపల్లి గ్రామంలో పల్లెప్రగతి పనులను పరిశీలన
నవతెలంగాణ-దోమ
పల్లెలు పచ్చగా ఉండాలంటే హరితహారంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమీ బసు పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని బాసుపల్లి గ్రామంలో నాల్గో పల్లె ప్రగతి, ఏడో విడత హరితహారంలో భాగంగా గ్రా మంలో పరిసరాల పరిశుభ్రత, ఇంకుడు గుంతలు, ప ల్లె ప్రకృతి వనంను జిల్లా పీడీ కృష్ణన్‌తో కలిసి పర్యటిం చారు. పల్లె ప్రకృతి వనంలో కలెక్టర్ మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో ఇంటిలో వాడిన మురుగు నీరు రోడ్డుపై రాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలనీ పంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్‌కు కలెక్టర్ సూచించారు. గ్రామంలో ఇండ్లపై వేలాడుతున్న కరెంట్ తీగలను సరి చేయాలని, తుప్పుపట్టిన కరెంట్ స్తంభాలను తొలగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో పాడుబడిన ఇండ్లను కూల్చివేయాలన్నారు. ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, పరిసరాలను శుభ్రంగా ఉం చుకోవాలన్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలన్నారు. పల్లె ప్రకృతి నవంలో మొక్కలు పెం పకం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసినం దుకు సర్పంచ్ పద్మశ్రీనివాస్ను కలెక్టర్ పౌసమీ బసు అభినందించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. గ్రామంలో కొంత మంది మహిళలు మరుగుదొడ్లు కట్టించుకుని రెండేం డ్లు అవుతున్నా ఇప్పటి వరకు బిల్లు రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, బిల్లులు వచ్చే విధంగా చూస్తామ ని బాధితులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీడీ కృష్ణన్, ఎంపీడీఓ జయరాం, ఎంపీఓ సురేష్, ఆ ర్‌ఐ రాజేందర్, లింగం, పంచాయతీ రాజ్ ఏఈ మణి కుమార్, ఇరిగేషన్ ఏఈ రాఘవేందర్, ఈసీ సత్య నారాయణ, ఏపీఓ వెంకటేష్‌గౌడ్, అటవీ శాఖ పోలీస్ అధికారి హరిబాబు, మండల విద్యుత్ అధికారులు కిషోర్, భీమలింగప్ప, లైన్మెన్ మహేందర్, సర్పంచ్ పద్మ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్, ఉప సర్పంచ్ బిచ్చిరెడ్డి, వార్డు సభ్యులు వెంకటయ్య, శ్రీకాంత్, పోలీస్ అధికారులు వెంకటేష్, హెడ్ కానిస్టేబుల్ నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.