Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఈఓ హరిచందర్
నవతెలంగాణ-దోమ
కోవిడ్ కారణంగా పాఠశాల తరగతులకు దూరమైన విద్యార్థులపై ఇంటింటికీ తిరిగి శ్రద్ధ వహించాలని ఎంఈఓ హరిచందర్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని మోత్కూర్, ఖమ్మంనా చారం, జంగీర్ సబ్ తండా, జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఆన్లైన్ తరగ తుల రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సందేహాలు ఉంటే ఉపాధ్యాయులు నివృత్తి చేయాలన్నారు. విద్యార్థులను ఆన్లైన్ బోధన తరగతులలో జరిగిన ప్రశ్నలను అడగా లన్నారు. కోవిడ్ పట్ల ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటిస్తూ తాగు జాగ్రత్త పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చక్రధర్, సీఆర్పీ సతీష్, తదితరులు పాల్గొన్నారు.