Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
పరిగిలో గంజాయి కలకలం రేపిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పరిగి పట్టణ కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన నలుగురు చిన్నారులు ఉదయం పడుకొని ఎంతకి నిద్రలేవకపోవడంతో వారి తల్లిదండ్రులు నీళ్ళు పోసి లేపారు. ఎందుకిలా నిద్రపోయారని చిన్నారుల ను వారి తల్లిదండ్రులు ప్రశ్నించగా బిత్తరపోయే సమాధానం చెప్పారు. తెలియక సిగరెట్ తాగామని. దాంతో నిద్రవచ్చి పడుకున్నామని చిన్నారులు చెప్పారు. కాలనీలో ఉన్న కల్లు కంపౌండ్‌కు చెందిన ఓ మైనర్ తమతో తాగించాడనే విషయం తల్లిదండ్రులతో చెప్పారు. ఆ సిగరెట్లో గంజాయి ఉండడంతో పిల్లలు ఇలా మత్తులోకి జారుకున్నారని తల్లిదం డ్రులు ఆరోపించారు. దీంతో కాలనీ వాసులు అందరూ ఆందోళనకు దిగారు. అందరు కలిసి ఎక్సైజ్ పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న ఎక్సైజ్ పోలీసులు సిగరెట్ తాగించిన బాలుడిని ప్రశ్నించారు. సిగరెట్లు తాగించింది నిజమేనని వారి ముందు ఒప్పుకున్నాడు. ఎక్సైజ్ పోలీసులు మొదట దాటవేసే ధోరణిలో సమాధానమి చ్చారు. కాలనీలో గంజాయి సేవిస్తున్నారని సమాచారం మేరకు మేము ఇక్కడికి వచ్చామని అలాంటి ఆధారాలేవి తమకు లభించలేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 10 నిమిషాలలో తిరిగి వచ్చి కల్లు కంపౌండ్‌లో ఉన్న సిసాలన్నీ పగలగొట్టి కంపౌండ్ సీజ్ చేస్తున్నామని పొంతనలేని సమాధానం ఇచ్చి వెళ్ళి పోయారు. కాలనీవాసులు ఎక్సైజ్ పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శాంతి నగర్ కాలనీ శివారు ప్రాంతంలో ఉండడంతో ప్రతి రోజూ చాలా మంది అక్కడున్న కల్లు కంపౌండ్‌కు వచ్చి కల్లు తాగుతున్నారని, మరి కొందరు యువకులు చెట్ల కింద కూర్చొని గంజాయి తాగుతున్నారని కాలనీ వాసులు తెలిపారు. రాత్రిపూట 11 సమయం వరకు చెట్ల కింద కూర్చొని గంజాయి తాగడంతో కాలనీ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారు తాగడమే కాకుండా కాలనీలో ఉన్న వారిని కూడా చెడగొడుతున్నారని కాలనీవాసులు ఆరోపించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులను ప్రశ్నిస్తే మీరు ఏం చేస్తున్నారు అమ్మ అని ఎదురు ప్రశ్నిస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. ఇలా అధికారుల నిర్లక్ష్యం వల్లే పరిగిలో గంజాయి దందా యథేచ్ఛగా కొనసాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విచారణ జరపాలి
మాది శాంతినగర్ శివారు ప్రాంతంలో ఉంటుంది. 10 సంవత్సరాల లోపు మా పిల్లలకు కల్లు కంపౌండ్‌లో ఉన్న మైనర్ బాలుడు సిగరెట్లలో ఏమో పెట్టి తగ్గించారని, మా పిల్లలు చెబుతున్నారు. అది తాగిన తర్వాత మత్తుగా పడుకున్నారు. ఎంత లేపినా లేకపోవడంతో నీళ్లు కొట్టి లేపాం. దానిలో గంజాయి పెట్టి తప్పడం వల్లే ఇలా జరిగింది. ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చాం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలి.
- బాబు, శాంతినగర్ కాలనివాసి.
కల్లు కంపౌండ్ పూర్తిగా తీసివేయాలి
కల్లు దుకాణంకి వచ్చి గంజాయి తాగుతున్నారు. వారు తాగడమే కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలను కూడా చెడగొ డుతున్నారు. నిత్యం చాలా మంది యువకులు ఈ ప్రాం తంలో గంజాయి తాగుతున్నారు. బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నాం. దీనిపై అధికారుల ను ప్రశ్నించగా అది óకారులు మీరేం చేస్తున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మాకు పని ఉంటుంది పొలంకు వెళ్లి వచ్చే సమయంలో ఇలా జరి గింది. వెంటనే అక్కడి నుంచి కల్లు కంపౌండ్ తీసివేయాలి.
- మాధవి కాలనీ వాసి.
విచారణ చేపడుతాం
చిన్నపిల్లలు ఉదరు పడుకొని లేవ లేదని ఫిర్యాదు అందడంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి కాలనీ వాసులు గొడవ పడుతున్నారు. విచారించగా కల్లు, గంజాయిపై ఫిర్యాదులు వచ్చాయి. గంజాయి పై విచారణ చేపట్టగా ఎటువంటి సమాచారం అందలేదు. ఆ చిన్నపిలా ్లవాన్ని విచారించగా సిగిరెట్ తాగామని ఒప్పుకున్నాడు. ఉన్నత అధికారుల సూచనల మేరకు తదుపరి విచారణ చేపడతాం. కల్లు కంపౌండ్ సీజ్ చేశాం. కేసు కూడా నమోదు చేశాం.
- రాఘవేందర్, ఎక్సైజ్ ఎస్సై.