Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరూ మొక్కలు నాటి సంరక్షించాలి
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-నవాబుపేట
దేశంలో మొక్కల పెంపకానికి చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమని, ప్రపంచం అంతా తెలం గాణ వైపు చూస్తోందని రేపటి భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసి కేసీఆర్ మొక్కల పెంపకానికి కృషి చేస్తు న్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నవాబు పేట మండలం మహితాభ్ ఖాన్‌గూడ గ్రామంలో సర్పంచ్ అనిత రంగారెడ్డి, ఎంపీటీసీ సుమలత మాణిక్య రెడ్డి అధ్య క్షతన, నవాబ్‌పేట మండల కేంద్రంలో సర్పంచులు బల్వంత్ రెడ్డి, విజయలక్ష్మి ప్రకాశం, ఎంపీటీసీ పద్మ నాగిరెడ్డి, అధ్యక్షతన ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాల, శ్రీ శక్తి భవన్ ఆవరణలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వ హించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ హరితహారం కార్యక్రమం దేశానికే స్ఫూర్తిదా యకమని, రాష్ట్రాన్ని పూర్తి హరిత తెలంగాణగా మార్చడ మే సీఎం కేసీఆర్ స్వప్నమని అన్నారు. తరిగిపోయే వనరులను పునరుద్ధరించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన హరితహారం కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మొక్కలు పెరిగి రాష్ట్రం హరితవనంగా మారుతుందని అశాభావం వ్యక్తం చేశారు. మొక్కలను సంరక్షించినప్పుడే హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. పెరుగుతున్న పర్యావరణ కాలుష్య నివారణకు మొ క్కల పెంపకమే ఏకైక మార్గమని తెలిపారు.మొక్కలు నాటడం.. మన భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయడమేనని అన్నారు. గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యం మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపించా లని ప్రజాప్రతినిధులకు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయంతో నశిం చిన అడవుల పునరుద్ధరణ జరిగిందని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. భవిష్యత్ తరాలకు మెరుగైన రాష్ట్రం, మెరుగైన పట్టణం అందించాలనే సంకల్పంతో ఈ హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు నాగిరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షు లు రావుగారి వెంకట్‌రెడ్డి, సర్పంచులు రఫి, బల్వంత్‌రెడ్డి, విజయలక్ష్మి ప్రకాశం, విమలమ్మ రంగరెడ్డి, ఎంపీటీసీలు సు మలత మాణిక్యరెడ్డి, పద్మనాగిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నా యకులు మల్లారెడ్డి, రంగారెడ్డి, భరత్‌రెడ్డి, ప్రకాశం, ప్రభా కర్, జైపాల్‌రెడ్డి, రంగరెడ్డి, మాణిక్యరెడ్డి, శాంతకుమార్, అధికారులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.