Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాటలు విని ప్రయివేటు వెంచర్ గేటు, భవనాలు కూల్చడం సరికాదని సీపీఐ(ఎం) నాయకులు జంగయ్య అన్నారు. టంగుటూరి నుంచి వీ ర్లపల్లి గేట్‌కి వెళ్ళే దారిలో 60ఎకరాల వెంచర్ గేటును మూడు రోజుల క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 4 ఎక రాల భూమి ఉంది. ఆ భూమిలోకి దారి కావాలంటూ కలెక్టర్, కమిషనర్, డీపీఓ, డీఎల్పీఓ కుమ్మకై రాత్రికి, రా త్రే గేటును, భవనాన్ని కూల్చివేయడం ఎంతవరకు సమం జసమని ఆయన ప్రశ్నించారు. గురువారం మధ్యాహ్నం డీఎల్పీవో శ్రీకాంత్ రెడ్డి రావడంతో సీపీఐ(ఎం) నాయకులు సమాచారం తెలుసుకొని వారి వద్దకు వెళ్లి జీవో 111లో 84 గ్రామాల్లో లేని ఇక్కడ ఏమి ఉందని ప్రశ్నించారు. వెం చర్ యజమానిపైకక్ష కట్టారని విమ ర్శించారు. వెంచర్ యజమాని 60 ఎక రాల భూమి తీసుకున్న తర్వాత టంగు టూరు గ్రామంలో కోట్ల రూపాయల వి లువైన భూములకు ధరలు కలుగుతున్నా యని అన్నారు. మండలంలోని మియాం కనిగడ్డ, జన్వాడలో కేటీఆర్, కవిత పామ్ హౌస్‌లు ఉన్నాయని ముందుగా వాటిని ధ్వంసం చేయా లని వారు కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పల్లెటూరు గ్రామంలో దళిత సర్పంచ్, దళిత చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, వారిని అవమా నపరచడానికే టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాటకమ డుతున్నారని విమర్శించారు. జిల్లా స్థాయిలో టంగటూరు గ్రామానికి మంచి పేరు తెలంగాణ ప్రభుత్వ ఎమ్మెల్యేలు, కమిషనర్, కలెక్టర్, డీపీఓ, డీఎల్పీవో కక్షపూరిత పనులు మా నుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ(ఎం) నాయకులు సంజీవ, విష్ణు, కిష్టయ్య, సత్యనారాయణగౌడ్, తదితరులు ఉన్నారు.