Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ సహకరించాలి
- మురుగు కాల్వల పనులను వెంటనే పూర్తి చేయాలి
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమీ బసు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా చూడాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమీ బసు అన్నారు. గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తాండూరు పట్టణంలో జరుగుతున్న పారిశుధ్య, అభివృద్ధి పనులను, హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పట్టణాన్ని పరిశుభ్రం గా, పచ్చదనంగా ఉంచాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచికోవాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. పాత తాండూరు మున్సిపాలిటీలోని 9 వ వార్డు, 15వ వార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పట్టణ ప్రగ తి నేపథ్యంలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా తాండూరు పట్టణం అవెన్యూ ప్లాంటేషన్ క్రింద ప్రధాన రోడ్డు ప్రక్కన మొక్కలు నాటారు. ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున మొక్కలను పంపిణీ చేయాల న్నారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ ఏర్పాట్ల పనులపై మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్నపరిమల్కు సలహాలు, సూచనలు చేశారు. డ్రయినేజీ, మురుగు కాలువల పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. పిచ్చి మొక్కలు తొలగించి మొక్కలు నాటి పట్టణాన్ని సుందరికరించాల్సిందిగా తెలిపారు. ము న్సిపల్ పరిధిలోని 9వ వార్డు, 15వ వార్డులో పర్యటించిన కలెక్టర్ పారిశుధ్య పనులు పర్యవేక్షించారు. స్థానిక సమస్య లను కౌన్సిలర్లను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలిగించాలని భవన యజ మానికి సూచించారు. వార్డు ప్రజలు తమ వార్డులలో ఉన్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలు అన్నింటిని పరిష్కరిస్తామని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ అశోక్ కుమార్, తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, ఫారెస్ట్ అధికారి శ్యాంసుందర్, 9వ వార్డు కౌన్సి లర్ దీప నర్సింలు, 15వ వార్డు వైస్ చైర్మన్ శోభరాని మున్సి పల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.