Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ సీఈవో జానకీరెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
హరితహారంలో నాటిన మొక్కలతో గ్రామాలన్ని పచ్చని తోరణాలుగా మారాలని జెడ్పీ సీఈవో జానకీరెడ్డి అన్నారు. గురువారం కుల్కచర్ల మండలం లోని లింగంపల్లి, దాస్యనాయక్ తండా గ్రామ పంచా యతీల్లో పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది పనులు, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు లను పరిశీలించారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమాల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. వర్షాకాలంలో అధికారులు, ప్రజా ప్రతి నిధులు సమన్వయంతో పనిచేసి జాగ్రత్తగా ఉండాల న్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహా రం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాందాస్‌నాయక్, ఎంపీడీవో నాగవేణి, ఎం పీఓ సుందర్‌లాల్, ఏపీఓ మల్లికార్జున్ యాదవ్, ఈసీ చంద్రశేఖర్, లింగంపల్లి సర్పంచ్ శారదా బస్వరాజ్, దాస్యనాయక్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ శంకర్, టీఏ డాక్యనాయక్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.