Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-కోట్‌పల్లి
గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసి గ్రామంలో చెత్తచెదారం వేయకుండా చుట్టు పక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం బం ట్వారం మండల పరిధిలోని రొంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేం దుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఆయన తెలిపారు. మన ఇంటి పరిశుభ్రతతో పాటు గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఇంటింటికి తప్పకుండా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం చెరువు మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, ఎంపీపీ ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ ఉమా దేవి చందు సింగ్, రైతుబంధు అధ్యక్షులు కాజా పాష, సర్పం చుల సంఘం అధ్యక్షుడు నర్సింలు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచులు నరసింహారెడ్డి, బర్కత్‌పల్లి నర్సింలు, నాయకులు బల్వంత్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శరణారెడ్డి, ఆలంపల్లి శ్రీనివాస్, చందుసింగ్, తదితరులు పాల్గొన్నారు.