Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
- పలు గ్రామాల్లో శ్మశాన వాటికలు,
- పల్లె ప్రకృతి వనాల ప్రారంభం
నవతెలంగాణ-పూడూర్
టీఆర్ఎస్ హయంలోనే ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చినట్టు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండల పరిధిలోని సోమన్గుర్తి, పూడూర్, రేగడి మామిడిపల్లి గ్రామల్లో పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిం దన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. పల్లె ప్రకృతివనం, శ్మశాన వా టిక, డంపింగ్‌యార్డు నిర్మించినట్టు తెలిపారు. పూడూ రు మండల పరిధిలోని రేగడి మామిడిపల్లి వీటిలో ఏర్పాటు చేయడంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కృషి చేస్తానని అన్నారు. వర్షాకాలంలో రోడ్డున తిరగాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని త్వరలో ఈ సమస్యను పరిష్కారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మల్లిపెద్ది మేఘమాల ప్ర భాకర్ గుప్తా, హరితహారం మండల ప్రత్యేక అధికారి సుధారాణి, ఎంపీడీవో ఉష, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు అనంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైపాల్‌రెడ్డి, పూడూర్ సర్పంచ్ నవ్య నర సింహరెడ్డి, ఎంపీటీసీ సల్మా తాజుద్దీన్, సొసైటీ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ రాజేందర్ జంగయ్య, హజం, మంగలి శేఖర్, నాయకులు మధు సూదన్‌రెడ్డి, కో-ఆప్షన్ మెంబెర్ అనంత రాములు, కార్మిక విభాగం మండల అధ్యక్షులు కే హరీశ్వర్‌రెడ్డి, నజిరోదిన్, ముక్దర్, పాషా రామచంద్రి, శ్రీనివాస్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.