Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజనల్ వ్యాధులు రాకుండా శుభ్రత పాటించాలి
- పొడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డ్‌కు తరలించాలి
- వికారాబాద్ శాసనసభ సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-కోట్‌పల్లి
పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు శుభ్రంగా అవుతా యని వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యు లు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కొత్తపల్లి, రాంపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని గ్రామంలోని చెత్త చెదరాలను తొలిగించుకో వాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఆనంద్ గ్రా మ సర్పంచ్ గొడ్డలి మల్లయ్య, పంచాయతీ కార్యదర్శి నవీన్‌లతో మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమలపై ఆరా తీశారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డ్, స్మశానవాటిక నిర్మాణ పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. గ్రామంలో ప్రధాన మురుగు కాలువతో సతమతమవుతున్న మని గ్రామ ప్రజలు తెలపడంతో 15రోజుల్లో మురుగు కలవ సమస్యను పూర్తి చేయాలని స్థానిక ఎంపీడీఓ, ఎంపీఓలను ఆదేశించారు. నూతన మురుగు కాలువ అవసరం అనుకుంటే వెంటనే అంచనా వేసి జీపీ నిధుల నుంచి బడ్జెట్ కేటాయించాలని సంబంధిత పంచాయతి ఏఈ కౌశిక్ సర్పంచ్‌లతో సుచించారు. కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్మికులను శాలువా పులమాలతో ఎమ్మెల్యే ఆనంద్, ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డిలు సన్మానించారు. అనంతరం రాంపూర్ గ్రామం లో పర్యటించిన ఎమ్మెల్యే ఆనంద్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. చక్కటి మొక్కలతో ఎంతో విశాలంగా ప్రకృతి వనం ఏర్పాటు చెయ్యడం సంతోషం అని అన్నారు. రాంపూర్ గ్రామంలోని డంపింగ్ యార్డ్, నర్సరీలను పరిశీలించిన ఎమ్మెల్యే నర్సరీని శుబ్రాంగా పిచ్చిమొక్కలు లేకుండా చూసుకోవాలని, సంబంధిత నర్సరీ నిర్వాహకులను ఆదేశించారు. శ్మశాన వాటిక నిర్మాణ పనులను పూర్తి చేయాలని గ్రామ సర్పంచ్ అర్ధ అనితరెడ్డి, పంచాయతీ కార్యదర్శి లవారెడ్డి లను ఆదేశించారు. గ్రామంలోశ్రమిస్తున్న పారిశుధ్య కార్మి కులను గుర్తించి వారిని ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంచందర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ అనితరెడ్డి, గొడ్డలి మల్లయ్య, వైస్ ఎంపీపీ మల్ల ఉమాదేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుందరి అనీల్, సర్పంచ్ల సం ఘం మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయ కులు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.