Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
- పండుగలా కొనసాగుతున్న పట్టణ ప్రగతి
నవతెలంగాణ-ఆమనగల్
పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో పండుగలా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా గురువారం 9వ వార్డులోని విద్యానగర్ కాలనీలో, 8వ వార్డులోని సంకటోన్పల్లి గ్రామంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ప్రతి కాలనీలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యానగర్ కాలనీలో అంతర్గత మురికి కాలువ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్, కౌన్సిలర్లు సోనా జయరామ్ నాయక్, రాధమ్మ వెంకటయ్యల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు అనురాధ పత్య నాయక్, జర్పుల దశరథ్ నాయక్, విజిత రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, ఎంపీటీసీలు దోనాదుల కుమార్, లచ్ఛిరామ్ నాయక్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పొనుగోటి అర్జున్‌రావు, నాయకులు తోటి గిరియాదవ్, నిట్ట నారాయణ, అప్పం శ్రీను, సయ్యద్ ఖలీల్, గుత్తి బాలస్వామి, రూపం వెంకట్ రెడ్డి, నిరంజన్ గౌడ్, భాస్కర్, నరేందర్, రమేష్, వెంకటేష్, పాషా తదితరులు పాల్గొన్నారు.