Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు ధరల పెంపుతో పంట సాగు కష్టతరం
- ఏడేళ్ళల్లో లీటర్ డీజిల్పై పెరిగిన ధర రూ. 40
- రైతులు పండిచిన వరి పంటపై ఎమ్స్పీ రేటు పెంపు రూ.580
- ఏడాదిలో డీజిల్పై రూ. 20 పెంపు
- రైతు పండించిన పంటకు ఎమ్స్పీ రూ. 72 మాత్రమే పెంపు
- చమురు ధరల పెంపుతో జిల్లా రైతంగా ఈ ఏడాది రూ.1500 కోట్ల భారం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పెట్రోల్, డీజిల్ ధర పెంపు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తోంది. గత రెండేండ్లుగా వరుసగ చమురు ధరలు పెరగడంతో సన్న చిన్నకారు రైతులపై మోయలేని భారం పడుతోంది. రైతుల పట్ల ముసలి కన్నీరు కార్చుతున్న కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 72 ఎమ్ఎస్పీ కలిపిస్తూ , ఏడాది సమయంలో రూ.20 డీజిల్ ధరలు పెంచింది. దీంతో ఎకర పంట సాగుపై సుమారు రూ. 5 వేల భారం మోపింది. కేంద్ర ప్రభుత్వ వ్యవహారం 'చారాన కోడికి బారన మసాల ' అన్న చందంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొంత మేరకు కమర్షియల్ భూములు ఉన్నప్పటికీ అంతకు రెండింతలు వ్యవసాయ భూములు సైతం ఉన్నాయి. ఈ ప్రాంతంలో 60 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలు సాగు చేయనున్నట్టు వ్యవసాయ అధికారుల అంచనాలు ఉన్నాయి. ఇందుల్లో ప్రధాన పంటలు పత్తి, వరి, కందులు సాగు చేస్తుంటారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నుంచి ఇప్పటి వరకు డీజిల్పై రూ. 40 పెంచింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది 2014లో డీజిల్ ధర 56.78 పైసలు ఉండగా ప్రస్తుతం డీజిల్ ధర 97.58 పైసలు ఉంది. రెండవ దఫా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రెండేండ్లలో డీజిల్ ధరను రూ. 26.39 పైసలు పెంచింది. రైతుల పండించిన పంటకు రెండేళ్లుగా ఎమ్ఎస్పీ ( మినిమం మద్ధతు ధర ) రూ. 132 మాత్రమే పెంచింది. దీంతో రైతులకు వ్యవసాయం భారంగా మారింది. యేటికేడు నిత్యవసర ధరలు పెరుగుతుడటంతో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యవసాయ కూలీల పరిస్థితి దయనీయమైన స్థితికి చేరుతుంది. పంటసాగు పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేక రైతులు అప్పుల ఊబిలోకి నెట్ట బడుతున్నారు.
చమురు ధరల పెంపుతో జిల్లాపై రూ. 1500 కోట్ల అధనపు భారం
రెండేండ్ల నుంచి వరుసగా పెంచుతున్న చమురు ధరలతో వ్యవసాయం రంగం పెను ప్రమాదంలో పడింది. లీటర్ డీజిల్ ధర రెండేళ్ళ సమయంలో రూ. 26.39 పైసలు పెరగడంతో అమాతం పంట సాగు పెట్టబడి పెరిగిపోయింది. ఎకరం పొలం దుక్కి మొదలు పంట వేసే సమయానికి ట్రాక్టర్ కిరాయి రూ. 4500 నుంచి 7000 వరకు పెరిగింది. ఎకరానికి ట్రాక్టర్ కిరాయి రూ. 2500 పెరిగింది. ఈ రెండేళ్ళ కాలంలో నాటు కూలీలకు రూ. 1500, ట్రాన్స్పోర్టు చార్జీలు రూ. 1000, ఎరువులు, రసాయన మందులకు రూ. 500, హర్వెస్టింగ్కు రూ. 500 ఇలా ఎకరం పంట సాగుపై ఈ రెండేళ్ళల్లో సుమారు రూ.6 వేల ఆదనపు భారం పడింది.
ఎమ్మెస్పీ పెంపు రూ. 72
ఏడాదిలో డీజిల్ ధర రూ. 20 పెంచిన ప్రభుత్వం వరి పంటకు మినిమం మద్ధతు ధరను మాత్రం రూ. 72 పెంచింది. ప్రభుత్వం పెంచిన వరి ధాన్యం ధరతో ఎకరాకు రూ. 1540 అధనంగా ఆదాయం వస్తున్నప్పటికీ చమురు ధరల పెంపుతో ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు రెండింతలు ఈ ఏడాది పంట సాగుపై పెట్టుబడి పెరిగింది. ఈ ఏడాది వరి పంట పెంచిన మద్దతు ధరతో ఒక ఎకరాకు గతేడాదితో పోల్చితే అధనంగా రూ.1540 అదనంగా ఆధాయం వస్తోంది. కానీ ఈ ఏడాదిలో పెరిగిన చమురు ధరలతో ఒక ఎకరాకు పెరిగిన పెట్టుబడి రూ. 5500 అంటే ప్రభుత్వం ఇచ్చిన మద్ధతు ధరకు మూడింతలు రూ. 3960 అధనపు భారం రైతుల మోయక తప్పడం లేదు.
పెట్టుబడి పెరిగింది
నిత్యావసర సరుకుల రేటు, చమురు రేటు పెరుగడంతో వ్యవసాయ చేయడం కష్ట మవుతుంది. పొలం దుక్కి నుంచి కొత వరకు అన్నింటికి ధరలు పిరమైనవి. గతంలో ఒక ఎకరం పొలం దుక్కి మొదలు నాటు వరకు రూ. 5వేలు టాక్ట్రర్ కిరాయి అయితే.. ప్రస్తుతం రూ. 7 వేలు అవుతుంది. గతేడాది ఎకరం వరి పంట సాగుపై రూ. 25 వేల పెట్టుబడి వస్తే ఈ ఏడాది రూ. 30 వేలు దాటేలా ఉంది. నాటు కూలీల రేట్లు కూడా పెరిగినవి.. పంట సాగు చేయాలంటే ఒళ్లు జెంకుతుంది. పెట్టిన పెట్టుబడి అయిన వస్తుందా..అన్న భయం వెంటాడుతుంది.
రైతు తావు నాయక్, యాచారం మండలం, మొండి గౌరెల్లి గ్రామం