Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
చేతి వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మొదటి విడతలో మిగిలిపోయిన గొల్ల కుర్మలకుదారులకు గొర్రెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాయ పోలు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లా డారు.. రాష్ట్రంలోని చేతి వృత్తిదారులకు భరోసా కల్పించడంలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని గుర్తు చేశారు. మొదటి విడతలో గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ చేసి అన్ని రకాలుగా ఆదుకుంటున్నదని తెలిపారు. అంతరించిపోతున్న కుల వృత్తు లను పరిరక్షించడంతో పాటు వారి జీవితాలకు భరోసా కల్పిస్తుందని వివరిం చారు. రాష్ట్రంలోని గొల్ల, కురుమలు ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నారని తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని వివరించారు. రైతుబీమా, రైతుబంధు పథకాలు విజయవంతంగా కొనసాగిస్తుందని చెప్పారు. కరోనా కష్టకాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా కొనసాగించండం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాయిపోల్ గ్రామానికి చెందిన 42 మంది లబ్దిదారులకు, దండుమైలారం గ్రామానికి చెందిన 10 మంది లబ్దిదారులకు 52 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, ఆయా గ్రామాల సర్పంచులు మల్లీశ్వరి జంగయ్య, బల్వంత్‌రెడ్డి, ఎంపీటీసీ జ్యోతి భాస్కర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.