Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కల ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం
- తెలంగాణ దేశానికే ఆదర్శం
- తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-కోట్‌పల్లి
మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని తాండూర్ శాసనసభ సభ్యులు పైలట్ రోహిత్‌రెడ్డి అన్నారు శుక్రవారం పల్లె ప్రగతి లో భాగంగా కోట్‌పల్లి మండల కేంద్రంతో పాటు అన్నాసాగర్, లింగంపల్లి, ఇందోల్, బుగ్గపూర్, ఓగులాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షిం చుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. నాట ిన మొక్కలను రక్షించుకోవాలని సూచించారు. మొక్క ల ద్వారా తాగునీరు, గాలి, మంచి వాతావరణం లభిస్తుందని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, హరితహారం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో పార్కులు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమం తీసుకొని మారుమూల గ్రామాలను సుం దరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారని తెలిపారు. పల్లె ప్రగ తితో గ్రామాల రూపురేఖలు మారాయని తెలి పారు. గ్రామాల్లో డీఎమ్ఎఫ్టీ నిధులతో పనులను ప్రారం భించారు. కోట్‌పల్లి మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలో ఏండ్లుగా పురాతనమైన గుంతల్లో నీరు నిండి ఉన్నాయి. ప్రజలు దోమల బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామం చుట్టూ గుంతల ను పూడ్చి శుభ్రంగా తయారు చేయడంతో సర్పంచ్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ పూడ్చిన స్థలంలో గ్రామం చుట్టూ సీసీరోడ్డు కోసం నిధులు కేటాయి స్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళిగౌడ్, ఓగులాపూర్ సర్పం చ్ శోభారాణి రాములు, ఇందోల్ సర్పంచ్ రాంచందర్, అన్నసాగర్ సర్పంచ్ రాధాకృష్ణ, బుగ్గపురం సర్పంచ్ లక్ష్మీ వెంకటేశం, లింగంపల్లి సర్పంచ్ చంద్రకళ పెంటా రెడ్డి, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పతంగే మం జులపాండు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనిల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, వైస్ ఎంపీపీ మల్ల ఉమాదేవి, ఎంపీటీసీ అంబిక రాజు, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, కోట్‌పల్లి రైతుబంధు అధ్యక్షుడు స త్యం, మత్స్య శాఖ సహకార సంఘం అధ్యక్షుడు ఆనం ద్, కొత్తపల్లి సర్పంచ్ మల్లయ్య, నాయకులు లక్కాకుల మల్లేశం, లింగయ్య, పాతంగే పాండు. అనిల్ దొర, సూరయ్యగౌడ్, దశరథ్‌గౌడ్, అన్వర్, బల్వంత్, ఇస్మా యిల్, మోసిన్, తహసీల్దార్ అశ్వక్ రసూల్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.