Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటాలి
- దిర్సంపల్లి గ్రామాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య
నవతెలంగాణ-దోమ
గ్రామంలో పచ్చదానం, పరిశుభ్రతను నెలకొల్ప డంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని, క్రిమిటోరియం, కంపోస్టు షెడ్డును పరిశీలిం చారు. పలుచోట్ల మొక్కలు నాటారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ హరితహారం విజయవంతం కో సం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. నాటిన మొక్కలకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయాల న్నారు. దీనిపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పల్లె ప్రగతిలో పడుబడిన ఇండ్లను కూల్చి వేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయరామ్, సర్పంచ్ శాంతకొండారెడ్డి, ఎంపీఓ సురే ష్, పంచాయతీ కార్యదర్శి మొగులయ్య, ఎంపీ టీసీ నవాజ్‌రెడ్డి, ఏపీఓ వెంకటేష్‌గౌడ్, గ్రామస్తులు రాము లు గౌడ్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.