Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్పర్సన్ కప్పరి స్రవంతిచందు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో హరిత లక్ష్యాన్ని చేరుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి చందు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 21వ వార్డులో ఇంటింటికి ఆరు ముక్కల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇబ్రహీం పట్నం మున్సిపాలిటీని అన్నిరం గాల్లో అభివృద్ధి చేసేం దుకు ఎమ్మెల్యే సహకారంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వా మ్యంతో ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇండ్ల మధ్యలో ఉన్న పురాతన గోడలు ధ్వంసం చేయించడంతో పాటు పిచ్చి మొక్కల తొలగిం పు, డ్రయినేజీ వ్యవస్థ మెరుగు వంటి కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ హరితహారం కార్య క్రమాన్ని సైతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు తగ్గకుండా నాటాలని పిలుపునిచ్చారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని సైతం పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్ బర్ల మంగ జగదీశ్వర్ యాదవ్, మున్సిపాలిటీ కమిషనర్ జయంత్కుమార్, ఏఈ మల్లికార్జున్, వార్డు ఇన్చార్జి యాంజల లక్ష్మయ్య, తోట రామ్మోహన్, గుంటి బీమెరావు, కానుగుల మహేష్, ముదిగొండ అజరు, వనమల రవి, జైపాల్, ప్రవీణ్, వంశీ, పాల్గొన్నారు.