Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పిన ప్రమాదం
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపురం ఫ్లైఓవర్ స్థలంలో కారు గుంతలో పడటంతో గంటసేపు ట్రాఫిక్ జామ్ అయింది. శుక్రవారం ఉదయం కొద్దిపాటి వర్షానికి ఉదయం లారీ దిగిపోవడంతో అరగంట సేపు ట్రాఫిక్ జామ్ కావడంతో లారీని ఏదో విధంగా బయటకు తీశారు. సాయంత్రం చేవెళ్ల నుంచి శంకర్పల్లికి వస్తున్నా కారు ఫ్లవర్ ఫ్లైఓవర్ దిగుతున్న సమయంలో కారు గుంతల ఇరుక్కుపోయింది. దీంతో ఎంతసేపటికి పైకి రాకపోవడంతో అప్పటికి గంటసేపు ట్రాఫిక్జామ్ అయ్యింది. దీంతో మనుషులతో కారును బయటికి తీశారు. కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ఫ్లై ఓవర్ వేసే సమయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇలా జరుగుతుందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. ఈ నిర్లక్ష్యం ఎవరిదని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల వేసిన మూన్నాళ్లకి ఫ్లైఓవర్ గుంతలు పడటం ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్పై మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు నిత్యం తిరుగుతూ ఉంటారని గుంతలుపడి ఉన్న రోడ్డును వెంటనే బాగు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. చిన్నపాటి వర్షానికే గుంతలు పడితే అది పెద్ద భారీ వర్షాలు ఉంటే పరిస్థితి ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.