Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 170 సండ్ర దుంగలు స్వాధీనం..
- నిందితుడి అరెస్ట్
- వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి
నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్
ఎర్రచందనం ముసుగులో సండ్ర దుంగల అమ్మకానికి పాల్పడుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కడియాల కుంటతండా గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మాజీపల్లి శివారులోని శ్రీహరి శర్మ మామిడి తోటలో డంప్ చేశాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు షాద్‌నగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సుమారు 15 లక్షల విలువైన 170 సండ్ర దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. వివరాలను శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి శుక్రవారం శ్రీహరి శర్మ మామిడి తోటలో షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లాకు మైదుకూరు మండల ఎర్రబెల్లి గ్రామనికి చెందిన ఆదిబోయిన బ్రహ్మయ్య గతేడాది నవంబర్ నెలలో నంద్యాల ఫారెస్ట్ వారి వేలంలో సండ్ర దుంగలు కొనుగోలు చేసి ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని తిమ్మాజీపల్లి గ్రామ శివారులోని మామిడి తోటలో నిల్వ చేసి రూ.15 వేల వేతనం ఇచ్చి ఒక వ్యక్తిని కాపలాగా పెట్టాడని తెలిపారు. ఎర్రచందనంలా కనబడేలా సండ్ర దుంగల పైపొట్టును చెక్కి కొనుగోలు దారులకు ఫొటోలు పంపి ఎర్రచందనం దుంగలుగా నమ్మబలికి కిలో రూ.15 వేలకు అమ్మే యత్నం చేశారు. ఈ క్రమంలో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి దుంగలను స్వాధీనం చేసుకున్నార. నిందితునిపై చీటింగ్ కేసు, ఫారెస్ట్, పీడీ యాక్టు పెట్టి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రజలను మోసం చేసి వ్యాపారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ పట్టణ సీఐ నవీన్ కుమార్, కమ్మదనం ఫారెస్ట్ అధికారి అజీమ్, శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు పాల్గొన్నారు.