Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు రమేష్ మహారాజ్
నవతెలంగాణ-పరిగి
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈనెల 12వ తేదీ వికారాబాద్ జిల్లా కేంద్రంలో సైకిల్ యాత్ర చేపడుతున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ అన్నారు. శుక్రవారం పరిగి పట్టణ కేంద్రంలోని మాజి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు రమేష్ మహరాజ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి ఎంతో కషి చేసిన రామ్మోహన్‌రెడ్డికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఈనెల 12న కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం వికారాబాద్‌లో సైకిల్ యాత్ర కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. అదేవిధంగా 16న ఇందిరా పార్కు నుండి 20 వేల మందితో రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లి రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడిగా రమేష్ మహారాజు నియామకం అయినందుకు సోనియాగాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధర రూ.50, డీజిల్ ధర రూ.35గా ఉండేదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 దాటాయని మండిపడ్డారు. 12న నిర్వహించబోయే సైకిల్ యాత్రకు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు పరిశ్రమ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డ పల్లి కష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు సుభాష్ చందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నరసింహ దీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగవర్ధన్, జగన్, అయూబ్ పాల్గొన్నారు.