Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ బట్టు లలిత రమేష్
- విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురికి షోకాజ్ నోటీసులు
నవతెలంగాణ- మర్పల్లి
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో గుర్తించిన పలు సమస్యలను పరిష్కారించాలని, మిగిలిన సమస్యల పరిష్కారానికి కార్యదర్శులు, సర్పంచులు కృషి చేయాలని ఎంపీపీ బట్టు లలిత రమేష్, ఎంపీడీవో వెంకట్ రామ్గౌడ్లు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం హాల్లో కార్యదర్శులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో గుర్తించిన ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని అన్నారు. హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుం డా టార్గెట్‌ను పూర్తి చేయాలలి చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ముందస్తు సమాచారం ఇచ్చినా సమావేశానికి హాజరుకాని టెక్నికల్ అసిస్టెంట్‌కు, ఆలస్యంగా సమావేశానికి వచ్చిన ఇద్దరు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సోమలింగం, ఏపీవో అంజిరెడ్డి, ఏపీఎం మధుకర్, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.