Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు చిన్నారులను కాపాడిన తోటి వాహనదారుడు రవి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ఒక మహిళ తన కారులో ముగ్గురు పిల్లలతో కలిసి మామిడిపల్లి నుంచి బంజారాహిల్స్ కు వెళ్తుండగా అత్తాపూర్లో పిల్లర్ నంబర్135 వద్ద కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మహిళతో పాటు ముగ్గురు చిన్నారులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన సోమవారం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం మామిడిపల్లికి చెందిన శైలజా అనే మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి తన కారులో మామిడిపల్లి నుంచి బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్కి వెళ్లడానికి మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయలుదేరింది. అయితే అత్తాపూర్ పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై నుంచి వెళ్తుండగా పిల్లర్ నెంబర్ 135 వద్దకు రాగానే కార్ లో ఉంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో ఆ మహిళ కారులో నుంచి ది గింది. కారు లాక్ అవ్వడంతో ముగ్గురు చిన్నారులు అందు లో ఇరుక్కుపోయారు. ఇది గమనించిన తొటి వాహనదారుడు రవి వెంటనే తన కారులో నుంచి ఇనుప రాడు తీసుకొని వచ్చి కారు అద్దాలు పగలగొట్టి తన ప్రాణాలకు తెగించి ముగ్గురు చిన్నారులను కారులో నుంచి బయటకు తీశాడు. త్రుటిలో ముగ్గురు ప్రాణాలను రవి కాపాడాడు. అదే సమయంలో మహేశ్వరంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ అదే దారిన వెళ్తుండగా వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ఫైర్ ఇంజన్ రంగంలోకి దింపి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. కారులో మంటలు చెలరేగిన విషయాన్ని కారులో నుంచి తమిళిసై సౌందరరాజన్ వీక్షించారు. రాజేంద్రనగర్ పోలీసులు శైలజతో పాటు ఇద్దరు కుమారులు 2 నెలల పాపను సురక్షితంగా ఇంటికి పంపించారు. ఈ ప్రమాదంలో శైలజ తో పాటు ఇద్దరు చిన్నారులు పాపను ప్రాణాలతో కాపాడిన రవి అనే యువకుడిని రాజేంద్రనగర్ ఏసీపీ సంజరు కుమార్, స్థానికులు ప్రశంసించారు.