Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛైర్పర్సన్ రేఖాయాదగిరి
నవతెలంగాణ-గండిపేట్
విద్యార్థులకు ఆన్లైన్లో మెరుగైన విద్యనందించాలని నార్సింగి ఛైర్పర్సన్ దార్గుపల్లి రేఖాయాదగిరి అన్నారు. సోమవారం నార్సింగి మున్సిపల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు చేయూ తనివ్వాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పాఠశాలలో నెలకొన్న సమ స్యలను పరిష్కారించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ విజరుకుమార్, కౌన్సిలర్ పత్తి శ్రీకాంత్రావ్, ఉషారాణి, పుతాడి నరేష్, నాయకులు యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.