Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించండి
- హెచ్ఎం ఉమామహేశ్వరి
నవతెలంగాణ-శంషాబాద్
మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశా ల ప్రధానోపాధ్యాయురాలు పి. ఉమామహేశ్వరి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం అందించే పాఠ్య పుస్తకాల పంపిణీి ప్రారంభించామన్నారు. విద్యార్థుల కు ఆన్లైన్ విద్యాబోధన కొనసాగుతున్నదని ప్రతి విద్యార్థి ఆన్లైన్లో వచ్చే పాఠాల ను చూసి నేర్చుకునేలా ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలతో పాటు ఉచిత బోధన భోజన వసతి కల్పిస్తున్నామని, అన్ని రకాల విద్యా సౌకర్యాలను ఉచితంగా పొందే అవకాశం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనీ కోరారు. తమ గర్ల్స్ హైస్కూల్లో బాలికల విద్యకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా మని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుర్వి జగతి, భువనేశ్వరీ, సత్యమ్మ, సునీత, వెంకటలక్ష్మీ రత్న మాల, శాంతి, వసుందర, సరిత తదితరులు పాల్గొన్నారు.