Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య
నవతెలంగాణ- కొడంగల్
ఐసీడీఎస్ను బలోపేతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య అన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల ఆలిండియా డిమాండ్స్ డే సందర్భంగా కొడంగల్ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారి కి సీఐటీయూ ఆ ధ్వర్యంలో మెమోరండం అందించారు. ఈ సందర్భం గా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్ర య్య మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి ఐసీడీఎస్ను బలోపేతం చేయాలన్నారు. అం గన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించా లన్నారు. కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాల న్నారు. 2018 అక్టోబర్ నుంచి కేంద్రం పెంచిన వేతనాలు చెల్లించాలనారు. 2017 నుంచి పెండింగ్ టీఏ, డీఏలు ఇతర బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. 11వ పీఆర్సీ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరించాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు చట్టబద్ధ సౌకర్యాలు కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం టీచర్లకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు, హెల్పర్ లకు, మినీ వర్కర్లకు రూ.15,600 రూపాయలు కనీస వేతనం చెల్లించా లన్నారు. మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలన్నారు. ఈ కేంద్రాల్లో హెల్పర్ లను నియమించాలన్నారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకట్, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.