Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చి బౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో గల భారతీయ నవయుగ సంఘం వ్యాయామశాలను బీజేపీ రాష్ట్ర నాయకు లు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిలు సోమవారం ప్రారంభించారు. భారతీయ నవయుగ సంఘం సభ్యులకు వ్యాయామశాల సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యా యామశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపా ధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌చారి, చెట్టి మహేందర్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ దయాకర్, సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్, నరేందర్ యాదవ్, శంలేట్ రాజు, శ్యామ్ యాదవ్, రమేష్ యాదవ్, ఆర్. వెంకటేష్, సతీష్‌గౌడ్, అశ్విన్, దేవి, గోపాల్, మన్నే రమేష్, వరలక్ష్మి, ఇందిర, వ్యాయామశాల నిర్వాహకులు పాల్గొన్నారు.