Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కొడంగల్
ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి కొడంగల్ మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన భీమమ్మ ఇల్లు వెనకభాగం గోడ కూలిపోయింది. భీమమ్మ భర్త చనిపో వడంతో తల్లి, కుమారుడితో కలిసి నివాసం ఉంటుంది. భర్త చనిపోవడంతో కుటుంబ భారం భీమమ్మ మోస్తూ రోజు కూలి పనులు చేస్తూ కుటుంబ పోషణ కొనసాగిస్తుంది. అసలే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం ఇప్పుడు వర్షానికి సొంత ఇల్లు కూడా కూలడంతో రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఆమె నిరుపేదలు కావడంతో ధ్వంసమైన నివాసంలోనే తల దాచుకుంటుంది. రోజు వారి కష్టం చేసుకుని బతికే వీరు ఇల్లు కూలిపోవడంతో భీమమ్మ కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం భీమమ్మను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితురాలు కోరుతున్నారు.