Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణికొండ
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో కాలపరిమితి ముగిసిన కనీస వేతనాల జీవోలను వెంటనే విడుదల చే యాలని, కార్మికులకు కనీస వేతనం 21 వేల రూపాయ లు ఉండాలని, డిఎ 15 రూపాయలు నిర్ణయించాలని కాంట్రాక్టు కార్మికులతో కాటేదాన్ పారిశ్రామిక క్లస్టర్ పరిసర ప్రాంతాల్లో కార్మికుల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్ర మోహన్ పాల్గొని మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి పెరిగిన ధరలకు అనుగుణంగా జీవోలను మార్చి కార్మికుల శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో కాటన్పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ రుద్ర కుమార్, కమిటీ సభ్యులు సచిన్, ప్రభు, రాఘవేందర్, దాస్, సలీం, కార్మికులు పాల్గొని సంతకాల సేకరణ చేయడం జరిగింది.