Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ కొప్పు సుకన్య భాష
- ఎంపీడీవో తీర్పుకు నిరసనగా చాంబర్లో నిరసన
- సంఘీభావం తెలిపిన ఎంపీటీసీలు
- ఆమె తీరుపై రాతపూర్వకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తా
నవతెలంగాణ-యాచారం
మండలంలో ఎంపీడీవో అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారని ఎంపీపీ కొప్పు సుకన్య భాష ఆరోపించారు. సోమవారం ఎంపీపీ చాంబర్లో పల్లె ప్రకృతి ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వివరించిన తీర్పుకు నిరసనగా ఎంపీపీ నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షకు మద్దతుగా వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మీపతి గౌడ్, తాండ్ర లక్ష్మమ్మ, భారతమ్మ, రాజేందర్రెడ్డి, కొర్ర జ్యోతి అరవింద్ నాయక్ ఎంపీపీకి సంఘీభావం తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ సూటిగా సమాధానం చెప్పకుండా మొండిగా వ్యవహరిస్తూ అధికారపక్ష నాయకులతో నా పైన విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. మండలంలో ఎంపీడీవో విధులు నిర్వహిస్తున్న అప్పటి నుంచి నా పైన వివక్షత చూపుతూ, అభివృద్ధి కార్యక్రమాలపై నాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని విమర్శించారు. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవోలు ఇలా వ్యవహరించడం లేదని, అందరు సమన్వయంతో మండల అభివృద్ధికి కషి చేస్తున్నారని ఎంపీపీ గుర్తుచేశారు. ఎంపీడీఓ పూర్తిగా ఇష్టానుసారంగా ఎంపీపీ ప్రమేయం లేకుండా పనిచేస్తున్నారన్నారు. పల్లె నిద్ర లో భాగంగా ఎంపీడీవో కారణంగానే మాల్ గ్రామంలో గొడవలు తలెత్తాయని ఎంపీపీ గుర్తుచేశారు. మండలంలో జరుగుతున్న కార్యక్రమాలపై తనతో చర్చించకుండా సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తూ నన్ను అవమాన పరుస్తున్నారని ఎంపీపీ మండిపడ్డారు. ఈ మండలం నుంచి ఎంపీడీవో ను బదిలీ చేసే వరకు నా దీక్షను కొనసాగిస్తానని అన్నారు. ఎంపీపీగా మండలంలో అగౌరవపరిచే విధంగా ఎంపీడీవో పనితీరు ఉందని ఆమె తెలిపారు. మండలంలో అభివృద్ధి కార్యక్రమాలపై తనకు తెలియకుండా సర్పంచుల తో, పంచాయతీ సెక్రెటరీ లతో సమావేశాలు జరుపుతున్నారని ఎంపీపీ వెల్లడించారు. ఎంపీడీవో తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ కప్పు సుకన్య భాష పేర్కొన్నారు.