Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ కాంగ్రెస్ ధర్నాలో
- మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ప్రతినిధి
కాంగ్రెస్ ముందు ఇకపై ఏ పార్టీ నిలబడలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాకతో పార్టీ బలంగా మారిందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు డి రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సైకిల్ పై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి జిల్లాలోని అనేక మంది భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్ ధర లీటర్కు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 రూపాయలు ఉందన్నారు. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర 71రూపాయలు ఉంటే.. ఇప్పుడు అది 105 రూపాయలకు చేరిందన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై టీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వాలకి పట్టదా అని నిలదీశారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అంతకు ముందు ఆలంపల్లి లోని దర్గా వద్ద ప్రత్యేక పూజలు పూజలు చేశారు ఆలంపల్లి నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి నాయకులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లతోపాటు అనేకమంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.