Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని నియోజకవర్గల్లో జాబ్‌మేళాలు
- స్ధానిక పరిశ్రమల్లో స్ధానికులకు ప్రాధాన్యత
- విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మహేశ్వరం
మహేశ్వరం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యశిక్షణ కేంద్రాలు జాబ్‌మేళాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో నిరుద్యోగ యువతకు డిఆర్డిఎ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మెగాజాబ్ మేళాను ప్రారంభించారు. ఈ జాబ్‌మేళాలో 810మంది యువతీ యువకులు పాల్గొ న్నారు. నిరుద్యోగ యువతీ యువకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కరోనా మహమ్మారితో రెండెళ్లుగా ప్రభుత్వ ప్రయివేటు రంగ సంస్ధలు పరిశ్రమలు తీవ్ర ఒడిదుడుకులకు గురై ఆర్థిక రంగం దెబ్బతిని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత చిన్నాభిన్నమైనందున వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయివేటు రంగంలోని పరిశ్రమలు కార్పొరేట్ సంస్థలతో జాబ్‌మేళాలు నిర్వహిన్నట్టు పేర్కోన్నారు. నిరుద్యోగులకు జాబ్‌మేళా ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మహేశ్వరం నియోజక వర్గంలోని పారిశ్రమికవాడల్లో కొత్తగా ఏర్పాడుతున్న పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు అవకాశం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుందని అన్నారు. వారినైపుణాన్ని పరిగణలోకి తీసుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి కె.రఘుమారెడ్డి, వైస్ఎంపిపి ఆర్ సునితాఅంద్యానాయక్, ఎంపిటిసి పి.సుదర్శన్‌యాదవ్ , సర్పంచ్ కె.ప్రియాంకరాజేష్, డీఆర్డిఎ ప్రాజెక్టు డైరేక్టర్ ప్రభాకర్, ఎండిఓ నరర్సింహ్మ, ఎ.హామిద్, పిడి జంగారెడ్డి , వివిధ పారిశ్రమల ప్రతినిధులు , వివిద గ్రామాల సర్పంచ్‌లు ,ఎంపిటిసీలు,నాయకులు పాల్గొన్నారు.