Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ -నకిరేకల్
ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న తెలంగాణ దళిత బంధుతో వారి జీవితాల్లో వెలుగులు వస్తాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. దళితబంధు ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళిత బంధు పథకంతో దళితులకు మంచి రోజులు వస్తాయన్నారు. ఈ పథకం వల్ల ఎస్సీ లలో ఆత్మస్థైర్యం, గౌరవం పెరగనుందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేసి త్వరలో వారికి రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, వలిగొండ మార్కెట్ చైర్మెన్ కే. కవిత , నకిరేకల్ మార్కెట్ చైర్మెన్ నడికుడి ఉమా రాణి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మెన్ పాల్ రెడ్డి మహేందర్ రెడ్డి, నాయకులు మురారీ శెట్టి కష్ణ మూర్తి, పల్లె విజరు, కొండ శ్రీను, యాల్లపు రెడ్డి సైధి రెడ్డి, గుర్రం గణేష్, మంగిన పల్లి రాజు, రాచకొండ వెంకన్న, బాణోతు వెంకన్న, గడ్డం స్వామి, వంటేపాక సుందర్,బన్నీ, దైద పరమేశం పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి పర్యటన
మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ వార్డు సభ్యులు రమేష్‌ను పరామర్శించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, పల్లె విజరు, రాచకొండ సునీల్, నాగులవంచ వెంకటేశ్వర్లు, రాచకొండ శ్రవణ్, వంటేపాక సుందర్, దైద పరమేశం, చౌగోని శంకర్, తలారి రాము, వంగాల కర్ణకర్ ఉన్నారు.