Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం, మాదాపూర్, ఖానామెట్ గ్రామంలో సర్వే నంబర్ 41/14 లో ఐదెకరాల స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు సోమవారం కమ్మ సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ నివాసంలో గాంధీని ఆ సంఘం కోదాడ, కాకతీయ కమ్మ సేవా సంఘాల సమన్వయ సమితి సభ్యులు శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కమ్మ సామాజికం కుటుంబ సభ్యుల తరుపున ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు స్థలాలు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ ఆదర్శప్రాయులని అన్నారు. ఆ స్థలంలో నిర్మించే భవనం విద్యార్ధులకు, విద్యాపరమైన శిక్షణ కేంద్రంగా, పెండ్లిలకు కన్వెన్షన్ సెంటర్‌గా ఉపయోగపడేలా సకల సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కోదాడ కమ్మ సేవా సమితి అధ్యక్షుడు శ్రీ పెదనాటి వెంకటేశ్వరరావు, ముత్తవరపు పాండురంగారావు, వేమూరి సురేష్, కోదాడ కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావు ప్రముఖ వ్యాపారవేత్త గంటా సత్యనారాయణ, పోటు రంగారావు, కనగాల నాగేశ్వరరావు, మారుతి మాధవరావు, ముత్తినేని జగన్మోహన్ రావు, మందరపు అనంతరామయ్య, వీరేపల్లి నాగేంద్రప్రసాద్, ప్రముఖ హైకోర్డు అడ్వకేట్ వీరేపల్లి బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.