Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
తెలంగాణ సంస్కతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బోనాల ఉత్సవాలను అత్యంత వైభోపేతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను రాజేంద్రనగర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని 57 ఆలయాల నిర్వాహకులకు ఎమ్మెల్యే రూ.16,51,000 విలువ చేసే చెక్కులను ఆరాంఘర్‌లోని రాందేవ్ బాబా ఆలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి ఆలయాల వద్ద ఏర్పాట్లకు నిధులు సమకూర్చుతోందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించిన జీహెచ్ఎంసీ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈవో మోహన్ రావు, మాజీ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ వెంకటేష్, కరుణాకర్, సరప్ శ్రీనివాస్, యాదగిరి, చిన్న, తదితరులు పాల్గొన్నారు.