Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.40 వేల విలువ ఉన్న మద్యం సీసాలు స్వాధీనం
నవతెలంగాణ-కొత్తూరు
బోనాల పండుగ సందర్భంగా మద్యం షాపులను ప్రభుత్వం మూసివేయాలని ఆదేశించినా కొందరు అక్రమంగా నిల్వ చేసి మద్యం సీసాలను, వ్యక్తులను సోమవారం కొత్తూరు ఎస్ఐ సయ్యద్ నేతత్వంలో దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గూడూరు గ్రామ పంచాయతీలో బోనాల సందర్భంగా బందోబస్తు నిమిత్తం వెళ్లిన కొత్తూరు ఎస్సై సయ్యద్ నేతత్వంలోని పోలీసుల బందం కిరాణా షాపులపై దాడులు నిర్వహించారు. కొందరు అక్రమంగా మద్యం సీసాలను నిల్వచేసి అమ్ము తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి అదే గ్రామానికి చెందిన పి. అశోక్, కల్వకోల్ సిద్దయ్యలను అదుపులోకి తీసుకున్నారు. తమ కిరాణా షాపుల్లో ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసును ఎక్సైజ్ పోలీసులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.