Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుబీమా డబ్బులు స్వాహా కేసులలో ఎమ్మెల్యే నైతిక బాధ్యత వహించాలి
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి
- ఇరు కుటుంబాలకు రూ.10వేల ఆర్థిక సహాయం
నవతెలంగాణ-కుల్కచర్ల
నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళా రైతులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ రాఘవేందర్‌రెడ్డి చేతిలో మోసపోయిన దళిత మహిళా రైతు చంద్రమ్మ, నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన ఫకీర్ హుస్సేన్ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి రూ.5 వేల చొప్పున రూ10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సమన్వయ సమితి గ్రామ కో-ఆర్డినేటర్ టీిఆర్‌ఎస్ నాయకుడు రాఘవేందర్ రెడ్డి రైతు బీమా డబ్బులు కాజేసి రైతు కుటుంబాలను మోసం చేశాడని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేకూరా ల్సిందేనని ,న్యాయం జరిగే వరకు బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ధాన్యం తరుగు పేరుతో వేల బస్తాలు దోచుకున్నారని దుయ్యబట్టారు. మండలంలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యలైన ప్రతి ఒక్కరిని శిక్షించాలని అన్నారు.
బాధిత సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పుట్టాపహాడ్ గ్రామానికి చెందిన దినసరి కూలీ పకీరు హుస్సేన్ చనిపోవడంతో అతనికి లేబర్ ఇన్సూరెన్స్ డబ్బులు, రైతుబీమా డబ్బులు కుటుంబ సభ్యులను మోసం చేసి కాజేసిన రాఘవేందర్ రెడ్డి పై బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్, మాజీ ఎంపీపీ అంజిలయ్య గౌడ్, వెంకట్రాములు, కష్ణారెడ్డి, హరనాథ్‌రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.