Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తూరు
మండలంలోని పలు గ్రామాల్లో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ బోనాల పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. తీగపూర్, సిద్ధాపూర్, కోడిచెర్ల, పెంజర్ల, గూడూరు, తిమ్మాపూర్ స్టేషన్, తిమ్మాపూర్ చౌరస్తాలలో బోనాల పండుగకు సర్పంచులు, కౌన్సిలర్లు తగిన ఏర్పాట్లు చేశారు. గూడూరులోని ఉత్సావాల్లో ఆదివారం సాయంత్రం కొత్తూరు జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, కొత్తూరు మండల పరిషత్ అధ్యక్షులు పిన్నింటి మధుసూదన్ రెడ్డిలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగలో మహిళలు, యువకులు, చిన్నారులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు మైసగళ్ల రమాదేవి రమేష్, వడ్డే తులసమ్మ బాలయ్య, వెంకట్ రెడ్డి, మామిడి వసుంధర, బ్యాగరి సత్తయ్య, మక్తగూడ సర్పంచ్ కట్నం రాజు, నాయకులు ఎమ్మె సత్యనారాయణ, వడ్డే బాలయ్య, తిమ్మాపూర్ ఎంపీటీసీ చింతకింది రాజేందర్ గౌడ్, తీగాపూర్ రైతు సంఘం కో-ఆర్డినేటర్ మైసగళ్ల రమేష్, కోడిచెర్ల ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, మున్నూరు పద్మారావు, రవీందర్ గౌడ్, గూడూర్ ఉప సర్పంచ్ దయానంద్, తదితరులు పాల్గొన్నారు.