Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
మహారాజ్‌పేట గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం గ్రామ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు బోనాలు ఎత్తుకుని, ఊరేగింపుగా వెళ్లి, పోచమ్మ ఆలయంలో నైవేధ్యం సమర్పించారు. శివసత్తుల పూనకాలతో డప్పు వాయిద్యాలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహారాజ్‌పేట్ గ్రామంలో రెండు రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుజాతనర్సింహాచారీ, వార్డు సభ్యులు జంగమ్మ దశరథ, రాధికాణేష్, బద్రి శ్రీకాంత్ ముదిరాజ్, బద్రి శ్రీనివాస్ ముదిరాజ్, కుమార్, గడ్డంరవీందర్, భాజా అన్నపూర్ణాఅంజయ్య, ఎంపీటీసీ షెకయ్య, గ్రామపెద్దలు , గ్రామస్తులు ఉన్నారు.
శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలతో, మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు.కార్యక్రమంలో సర్పంచ్ సిహెచ్ స్వప్న మోహన్, ఎంపీటీసీ దయాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపెద్దలు ఉన్నారు.