Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
రాబోయే రోజులలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కందుకూరు, మహేశ్వరం మండలాలకు ప్రతి ఎకరాకు సాగు నీరందించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని బేగంపేట్, గుమ్మడవల్లి, గ్రామాల్లో రూ. 44 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాలను ఎమ్మెల్సీ సురభివాణిదేవితో కలిసి ఆమె ప్రారంభించారు. గుమ్మడవెల్లి పంచాయతీ తండాలో రూ.12 లక్షల నిధులతో, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కందుకూరు మండలంలో 10914, మహేశ్వరం మండలం లో 8251 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం వరి పంట సాగులో పంజాబ్ రాష్ట్రాన్ని మించిందన్నారు. మూడుకోట్ల మెట్రిక్ టన్నుల వరి సాగు జరిగిందన్నారు. రైతుబంధు కింద రాష్ట్రంలో రూ.15 వేల కోట్లు , రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వివరించారు. రైతుబీమా కింద 2536 మంది రైతులకు రూ.126 కోట్లు సహాయం అందజేసినట్టు వివరించారు. ఆగస్టు నెలలో రుణమాఫీ కింద రూ.50 వేలు రుణమాఫీ చేస్తామన్నారు. తద్వారా 20 వేల రైతులకు లాభం చేకూరుతోందన్నారు. రాష్ట్రంలో 2604 రైతు వేదిక భవనాలు మంజూరైనట్టు చెప్పారు.కల్తీ విత్తనాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి, మహేశ్వరం మార్కెటింగ్ చైర్పర్సన్ సురసాని వరలక్ష్మి సురేందర్ రెడ్డి, కందుకూరు సహకార సంఘం చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాంభూపాల్ రెడ్డి, కందుకూరు సహకార సంఘం వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, బేగంపేట సర్పంచ్ గోవర్ధన్, గుమ్మడవెల్లి సర్పంచ్ ప్రభాకర్, ఎంపీటీసీ బాల్ రాజు, గుమ్మడవెల్లి ఎంపీటీసీ రేఖ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎం.జయేందర్, ఉపాధ్యక్షులు ఎస్.మహేందర్ రెడ్డి, ఎంపీటీసీలు రాజశేఖర్ రెడ్డి, సురేష్, రాములు, సర్పంచులు కాసుల రామకృష్ణ రెడ్డి, సాదా మల్లారెడ్డి, నరేందర్ గౌడ్, ఏనుగు శ్రావణి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, పరంజ్యోతి, పోలేమోని బాలమణి అశోక్, డైరెక్టర్లు శేఖర్ రెడ్డి, ఆనంద్, సాదా పాండురంగారెడ్డి, పారిజాతం, నాయకులు ఎ.అంజయ్య గౌడ్, ఈశ్వర్‌గౌడ్, సదానందం గౌడ్, బి.వెంకటేష్, ఒక దీక్షిత్ రెడ్డి, కార్తీక్, పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.