Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దేముల్
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ ధనలక్ష్మి సూచించారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలోని మూడవ అంగన్వాడీ సెంటర్లో టీచర్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలపై గర్భిణు లకు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలింతలు సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గర్భిణులు ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.