Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ రంజిత్ రెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా బషీర్బాద్ మండల కేంద్రంలోని నవాంగి స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని ఎంపీ రంజిత్ రెడ్డి సోమవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మండలంలో 36 గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వరుస రైళ్ల రాకపోకల మార్గం కావడం, మండల కేంద్రానికి వెళ్లేందుకు ఇతర మార్గాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మానవరహిత, సహిత రైల్వే గేట్లను తొలగించి అండర్ బ్రిడ్జిలను నిర్మించాలన్నారు. రైల్వే శాఖ విధాన పరమైన నిర్ణయం కావున దయచేసి రైల్వే శాఖ మంత్రి నవాంగి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించి 36 గ్రామాల ప్రజలకు ఇబ్బందులను తొలగించాలని ఎంపీ రంజిత్ రెడ్డి పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.