Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్
పరిగిలోని బాల సదన్ సందర్శన
నవతెలంగాణ వికారాబాద్ ప్రతినిధి
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నా రులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లి దండ్రులని కోల్పోయిన పిల్లల స్థితిగతులు మెర గు పర్చే లక్ష్యంతో సీఎం కేసిఆర్ వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నేపథ్యంలో సోమవారం మంత్రులు పరిగిలోని బాల సదన్‌ను సందర్శించి, అక్కడి వస తులను, పిల్లల ఆరోగ్య, విద్యా పరిస్థితులను పరిశీ లించారు. సదన లో 29 మంది పిల్లలు ఉంటే దాదాపు ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఇంకా ఏమేమి వసతులు కల్పిస్తే బాగుంటుంది అని అడిగారు. ఇద్దరు తల్లిదండ్రు లు లేనివారు, తల్లి దండ్రులలో ఒకరిని కోల్పోయి న వారిని బాల సదన్‌లో ఆశ్రయం ఇచ్చి, వారికి విద్యాభ్యాసం చేయిస్తున్నారు. వీరిలో చిన్న పిల్లల నుంచి 10వ తరగతి చదివే వరకు గల బాలికలు ఉన్నారు. మంత్రులు, అధికారులు ఈ బాలికలు, పిల్లలలో మాట్లాడినప్పుడు తమ ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగుందని, బాగా చదువుకుంటున్నామని చెప్పారు. తాము పోలీస్, టీచర్ కావాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తమని తమ బంధువులు పట్టించుకోకున్నా, తల్లి దండ్రులలో ఎవరూ తమని చూడకున్నా ఇక్కడ తమను బాగా చూసుకుంటున్నారని వివరించారు. మంత్రులు పిల్లలని దగ్గరకు తీసుకొని, వారితో మాట్లాడారు. పిల్లలకు ఫ్రెండ్ షిప్ బాండ్స్ కట్టి భరోసా కల్పిం చారు. అనంతరం మీడియాతో మంత్రులు మా ట్లాడుతూఅనాథలను ఆదుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని అనాథలు అందరినీ అక్కున చేర్చుకో వాలని నిర్ణయించినట్టు తెలిపారు. చదువుకోవ డం, ఆ తరవాత కూడా మంచి భవిష్యత్ ఇచ్చే విధంగా చేయాలని చెప్పారు. తమ సందర్శనలో వెలుగు చూసిన విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కరోనా వల్ల 250 మంది వరకు, ఇతర కారణాల వల్ల ఇప్పటికే దా దాపు 15వేల మంది వరకు రాష్ట్రంలో అనాథలు ఉంటారని అంచనా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్యదేవరాజన్, కలెక్టర్ పౌసమీ బసు, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.