Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే
- బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకున్న సీఐ ఉపేందర్
సవతెలంగాణ-ఆమనగల్
జిల్లా పరిషత్ గ్రామీణాభివద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ వ్యవస్థాపించిన జర్పుల రాధాకష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈనేపథ్యంలో మంగళవారం ఆమనగల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని పోలీసులకు కడ్తాల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పొలిటికల్ లీడర్ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ హాజరై టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. ఇరు జట్ల మధ్య జరిగిన హౌరాహౌరీ పోరులో పోలీసుల టీం విజయం సాధించింది. అదేవిధంగా సీఐ జాల ఉపేందర్ బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకున్నారు. విజయం సాధించిన పోలీసుల టీంను జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ ఘనంగా సన్మానించి విజయోత్సవ జ్ఞాపికలను అందజేశారు. ఈ పోటీల్లో ఆమనగల్ కడ్తాల్ తలకొండపల్లి మండలాల ఎస్ఐలు ధర్మేష్, హరిశంకర్ గౌడ్, ఎస్వి ప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ ఆమనగల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, సర్పంచ్లు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, హరిచంద్ నాయక్, తులసీరామ్ నాయక్, యాదయ్య, ఎంపీటీసీలు బొప్పిడి గోపాల్, లచ్ఛిరామ్ నాయక్, బండి మంజుల చంద్రమౌళి, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి పరమేష్, మండల కమిటీ అధ్యక్షుడు జోగు వీరయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాచిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు లక్పతి నాయక్, పీఏసీఎస్ డైరక్టర్లు, నాయకులు పాండు నాయక్, నవీన్, రాజు, బాలకష్ణ, బీక్యా నాయక్, జగన్, రాజేష్, భాస్కర్, రమేష్ పాల్గొన్నారు.