Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ సివిల్ జడ్జీ ఎండీ ఉమర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
నవతెలంగాణ-దోమ
మండల కేంద్రనికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎండీ. రుక్మదిన్, ఫతిమబీ దంపతుల కుమారుడు ఎండీ ఉమర్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన ఎండీ ఉమర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అన్నారు.మంగళవారం దోమ మండల కేంద్రంలోని సివిల్ జడ్జిగా ఎంపికైన ఎండీ ఉమర్ నివాసానికి వెళ్లి, ఆయనకు పూల మాలలు వేసి, శాలువతో సన్మానించి, స్వీట్లు తినిపించారు.అనంతరం ఎండీ నివాసానికి స్వయంగా వచ్చిన, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని,ఉమర్‌తో పాటు కుటుంబసభ్యులు, ఇతర నాయకులు కలిసి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కె. నాగిరెడ్డి, సర్పంచ్ కె.రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం,ఉపసర్పంచ్ గోపాల్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లక్ష్మయ్య, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, మాజీ ఎంపీపీ రాజ గోపాలాచారి,పార్టీ నూతన, మాజీ అధ్యక్షులు హనుమంతు నాయక్, రాఘవేందర్ రెడ్డి,వార్డు సభ్యులు బెస్త లక్ష్మణ్, అర్షియమైను,నాయకులు ఎండి.గౌస్, గొల్ల శ్రీనివాస్, ముస్తఫా, బస్వరాజ్, తదితరులు పాల్గొన్నారు.
దోమ మండల కేంద్రానికి చెందిన ఎండి.ఉమర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సందర్భంగా దోమ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మంజుల కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల దోమ 2010-12 విద్యా సంవత్సరంలో విద్యనభ్యసించిన విద్యార్థి సివిల్ జడ్జిగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగిన ఎండి.ఉమర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తమ విద్యార్థి ఉన్నత స్థానానికి ఎదగడం సంతోషాన్ని కలిగించిందని ప్రిన్సిపాల్ మంజూల తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాధా, లక్ష్మయ్య, సునీత, మధుసూదన్, నాజీనిన్ బేగం తదితరులు పాల్గొన్నారు.