Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నాయకుడు ఎన్. మల్లేశ్
నవతెలంగాణ-శంషాబాద్
కరోనా నేపథ్యంలో ప్రాణాలను ఫణంగా పెట్టి, ప్రజలకు సేవలందిస్తున్న ఆశావర్కర్లకు సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా పీఆర్సీ ప్రకారం వేతనాలివ్వాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. మల్లేశ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు పెద్ద షాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌కు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి మార్చి 22న, జూన్ 11న రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీ అమలు చేస్తానని, ఆశావర్కర్లకు కూడా వర్తింపజేస్తుందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా, ఇప్పటి వరకు ఆశావర్కర్లకు 30 శాతం అదనపు వేతనం అందలేదన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం ఆశావర్కర్లకు రూ.21 వేలు,ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.కరోనా కారణంగా మృతి చెందిన ఆశావర్కర్ల కుటుం బాలకు రూ.50 లక్షలు ఎక్సిగ్రేషియా ఇవ్వాల న్నారు. లేనిపక్షంలో ఆశావర్కర్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు సువర్ణ, నవనీత, దేవమ్మ, మనీలా, భారతమ్మ, జయమ్మ, మంజుల, సునంద, శారద, సుమతమ్మ, తిరుమల తదితరులు పాల్గొన్నారు.