Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిపో మేనేజర్ సూర్యనారాయణ
- గ్రేటర్ జోన్ తరుపున కళాప్రదర్శన
నవతెలంగాణ-గండిపేట్
ప్రయాణికుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా పని చేస్తున్న టీఎస్ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మోహిదీపట్నం డిపో మేనేజర్ సూర్యనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ కృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం నగరంలోని గ్రేటర్ జోన్ కళా బృందం తరుపున ఆర్టీసీలోనే ప్రయాణం చేయాలంటూ ప్రదర్శనలు, పాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలోని నార్సింగి, మొయినాబాద్ మండల కేంద్రాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించారు. మేనేజర్ మాట్లాడుతూ 12 మంది ఆర్డీసీ ఉద్యోగులతో కూడిన ఈ కళా బృందం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే సురక్షితం, సుభద్రతా ఉంటుందన్నారు. వివిద రకాల సేవలను వివరిస్తే మహిళలకు పూర్తిగా రక్షణ కల్పిస్తూ వారు ఎక్కడ చేత్తి ఎత్తిన అక్కడ ఆర్టీసీ బస్సును అపడం చేస్తామన్నారు. శివారు ప్రాంతాలైన శంకర్పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, వికారాబాద్, తాండూరు ప్రాంతాలకు 15 నిమిషాలకో బస్సు వసతిని కల్పించినట్లు తెలిపారు. శంకర్పల్లి, చేవెళ్లకు ప్రత్యేకంగా మేట్రో సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రవేట్ వాహానాల్లో ప్రయాణం చేయవద్దన్నారు. ప్రవేట్ వాహానాల్లో ప్రయాణిస్తే భద్రతా లేదన్నారు. డీజీల్ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రవేట్ వాహాన దారులు ఛార్జీలను ఎక్కువగా ఉంటాయన్నారు. ఆర్టీసీల్లో అతితక్కువ ఛార్జీలతో అనుకున్న గమ్యాని చేరుస్తామన్నారు. కోవిడ్ నివారణ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కండక్టర్లు, డ్రైవర్లు వాక్సినేషన్ రెండు డోసులను తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంల్లో శంకర్పల్లి బస్టాండ్ సమన్వయ సభ్యులు కృష్ణ, గ్రేటర్ జోన్ కళా బృంద సభ్యులు టి. గణేష్, సంపత్‌కుమార్, పెట్రొజీ, గంధమాల కృష్ణ, శ్రీహారి, రాములు, రేణుగోపాల్, స్వప్న, ఛాయాదేవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -