Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నార్సింగి వైద్యాధికారికి సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాల వినతి
నవతెలంగాణ-గండిపేట్
ఆశావర్కర్ల సమస్యలను టీఆర్ఎస్ సర్కారు వెంటనే పరిష్కరించాలంటూ సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఆశావర్కర్ల యూనియన్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. మంగళవారం నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణంలో ఆశాలు ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ జీఓ ప్రకారం ఆశాలకు వేతనాలను అమలు చేయాలన్నారు. జాబ్‌కార్డులు, సెలవులు ఇవ్వాలన్నారు. కరోన సమయంలో పనిలోకి తీసుకున్న హెల్త్ వాలంటర్లను ఆశాలుగా కొనసాగించాలని కోరారు. డబుల్బెడ్రూం మంజూరు చేస్తూ.. కరోనా హెల్త్ ఇన్సురెన్స్, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అమలు చేయాలన్నారు. అనంతరం నార్సింగి హెల్త్ అధికారి శ్రీనివాస్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వీరేష్, ఆశాలు కవిత, సుజాత, శంకరమ్మ, వరమ్మ, అరుణ, రుక్మిణీ, సరితా, కవితా, పద్మా, జ్యోతి, విజయలక్ష్మీ పాల్గొన్నారు.