Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
తలకొండపల్లి మండలంలోని మెదక్పల్లి గ్రామానికి చెందిన ఎడ్ల చెన్నయ్య ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్లోని జీవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ తాను వ్యవ స్థాపించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి చెన్నయ్యకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయ కులు చంద్రమౌళి, షానమోని కుమార్, శ్రీను, వెంక టయ్య, దశరథ్, టీకేపి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి ఎంపీటీసీ ఆర్థిక సాయం
కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామానికి చెందిన అండేకార్ సుశీళాబాయి అనారోగ్యంతో సోమ వారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎంపీటీసీల సంఘం కార్యదర్శి, రావిచేడ్ ఎంపీటీసీ బొప్పిడి గోపాల్ మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.3 వేలు ఆర్థికసాయం అందజేశారు.కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు లింగంట్ప యాదవ్, బిక్షపతి, రమేష్, జైపాల్ రెడ్డి, సంతోష్, బాలరాజు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.