Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కోశాధికారి మల్లేశ్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని రగిలిద్దామని, బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో 9న నిర్వహించే రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలుపాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కోశాధికారి మల్లేష్, సీపీఐ(ఎం) పార్టీ రాజేంద్రనగర్ మండల కన్వీనర్ కురుమయ్య, గండిపేట మండల కన్వీనర్ రుద్రకుమార్ మంగళవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల, ప్రజల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ను కోరారు. అనంతరం ఎమ్మెల్యే దానికి సానుకూలంగా స్పందించారు.
ఆశా కార్మికులకు 11వపీఆర్సీని అమలు చేయాలి
ఆశా వర్కర్లకు వెంటనే 11వ పీఆర్సీ అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కోశాధికారి మల్లేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆశ కార్మికులతో కలిసి కాటేదాన్ ప్రభుత్వాస్పతి వైద్యులకు వినతిపత్రం అంద జేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆశా కార్మికులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.కార్యక్రమంలో సీఐటీయూ రాజేంద్రనగర్ మండల కన్వీనర్ కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.