Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
నవాబుపేట మండల్ గంగ్యాడ గ్రామంలో రైతుకు కొత్త పాస్ పుస్తకాలు ఇప్పిస్తానని నమ్మించి నవాబుపేట మండల్‌కు తీసుకొచ్చి తన 5 ఎకరాల 12 గంటల భూమిని కాజేసిన గ్రామ వీఆర్ఏపై సస్పెన్షన్ వేటు వేసినట్టు మండల తహసీల్దార్ తెలిపినట్టు గ్రామస్తులు దోసాడ మల్లేశం, భానూరి ఉపేందర్ రెడ్డిలు మంగళవారం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయకుడైన తమ గ్రామ రైతు ఆలూరి చిన్న పర్మయ్యను నమ్మి మోసం చేయడం దారుణమన్నారు. పర్మయ్య కొత్త పాస్ పుస్తకానికి గ్రామ సర్పంచ్ భర్త చిందం మల్లేశంను, గ్రామ వీఆర్ఏ కావలి మహేష్ కుమార్‌లను సంప్రదిస్తే రూ.11 వేలు ఖర్చు నిమిత్తం తీసుకొని మోసం చేశారన్నారు. సర్పంచ్ భర్త ప్రోద్బలంతో వీఆర్ఏ భాగస్వామిగా మారినందుకు వేటు పడటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కానీ ఈ కుట్రకు కారణమైన సర్పంచ్ భర్త చిందం మల్లేశంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే వీఆర్ఏపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇదివరకే సర్పంచ్ భర్తపై పదుల సంఖ్యలో పోలీసు కేసులు ఉన్నాయని తెలిపారు. ఇందుక అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. వారిని కటినంగా శిక్షించాలని, లేనిపక్షంలో కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేయడానికైనా వెనుకాడబోమని తెలిపారు.