Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలని కోరుతూ మంగళవారం వ్యకాస, సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్సా చంద్రయ్య మాట్లాడుతూ ఏడు దశాబ్దాల స్వాతంత్య్రనంతరం కూడా రైతులకు, కార్మికులకు, ఇతర శ్రమ జీవుల కష్టానికి తగిన ఫలితం రావడం లేదన్నారు. కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు దేశాన్ని అతలాకుతలం చేసిందన్నారు. నిత్యం పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, పెరుగుతున్న పేదరికం, ఉపాధికోసం వలసలు, పౌష్టికాహారలోపం,ఆకలిచావులు నేడు దేశాన్ని చుట్టుముట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మనదేశంలో 1942 ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో, ప్రతిఘటనా పోరాటాలకు సిద్ధం కావాలని వ్యకాస, అఖిల భారత కమిటీలు పిలుపుని చ్చాయని తెలిపారు. దీనిలో భాగంగా జులై 25 నుంచి ఆగస్టు 9 వరకు చేపడుతున్న ఉద్యమం చేస్తున్నామని వివరించారు.కావున 9న పెద్దఎత్తున ప్రజలు నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని సర్పంచులు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సూర్యనాయక్, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు యు.రమేష్, రజక సంఘం జిల్లా కార్యదర్శి రవి, దస్తప్ప, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
తాండూరు :కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు 9న దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కౌంటర్ పట్టణ కేంద్రంలో తాండూర్ ప్రభుత్వం పీపీ యూనిట్ సమీపంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు పీక్సిడ్ వేతనం రూ.10 వేలు చెల్లించి, 11 పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మికులకు కర్షకులకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను మారుస్తూ కార్మికులందరికీ తీవ్ర అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో 9న తాండూరు పట్టణంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో ఆశావర్కర్లు, అంగన్వాడీలు, వీఆర్ఏలు, హమాలీలు, మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో హాజరై, ఈ కార్యాక్ర మానికి జయపద్రం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు, తాండూరు నియోజకవర్గం అధ్యక్షురాలు రాజమణి, సుజాత, అరుణ, హేమలత, యాదమ్మ, తులసమ్మ, తదితరులు పాల్గొన్నారు.